కిటకిట లాడుతున్న రైళ్లు, బస్సులు.. అనేక చోట్ల సాంకేతిక సమస్యలు

byసూర్య | Mon, Jan 13, 2020, 02:45 PM

సంక్రాంతి పండుగకు వారాంతపు సెలవులు కలిసిరావటంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు ఏపీలోని తమ సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు సొంత వాహనాల్లో బయల్దేరే వారితో జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోంది. దీంతో వివిధ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్‌ మేర బారులుతీరుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల అమలులోకి తెచ్చిన ఫాస్ట్రాక్ వ్యవస్థవల్ల టోల్‌ ప్లాజాల్లో వాహనాల రద్దీ కొంతవరకు తగ్గినప్పటికీ ఇంకా అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను నియమించారు. కొన్నిచోట్ల అదనపు గేట్లను ఏర్పాటుచేశారు. ప్లాజాల నిర్వాహకులు కూడా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM