కేబుల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

byసూర్య | Mon, Jan 13, 2020, 02:44 PM

టెలికం రెగ్యులేటరీ అధారిటీ(ట్రాయ్) 2017 చట్టంలో చేసిన మార్పులను అమలులోకి తీసుకురానుంది. 2020 మార్చి 1నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయని సంస్థ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ ప్రకటించారు. వినియోగదారులకు ఇకపై ఏ ఛానెల్ కావాలన్నా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందన్న ఆయన.. నూతన చట్టంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుకే ఛానెల్స్ ఎంపిక చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేశారు.ట్రాయ్ ఎప్పుడూ ఛానెల్స్‌ను నియంత్రించదని.. అంతేకాకుండా సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న వార్తలన్నీ కూడా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం దేశంలో 38 బ్రాడ్‌కాస్టర్లు ఉన్నారు. ఇక అందులో 5 గురు తమ ఉచిత ఛానెల్స్‌ను పెయిడ్ ఛానెల్స్‌గా మార్చారని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం 909 ఛానెళ్లు అందుబాటులో ఉండగా వాటిలో 330 పెయిడ్ చానెళ్లు ఉన్నాయన్నారు.


ఇకపోతే ఒక బొకే ఛానెల్‌కు రూ.12లు మించకూడదని.. ఇక ఒక సంస్థ ఎన్ని బొకేలు అయినా పెట్టుకునే స్వేచ్ఛ ఉందని ఆయన తెలిపారు. కాగా, ఒక భాషకు చెందిన చానల్స్ అన్నీ కూడా ఒకే క్రమంలో ఉంచాలన్నారు.మరోవైపు టారిఫ్ ఆర్డర్‌కు సవరణలు చేసిన ట్రాయ్.. గతంలో ఉన్న బేసిక్ ప్యాక్, అలాకార్ట్ ప్యాక్ నిబంధనలను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై అన్ని ఫ్రీ టూ ఎయిర్ ఛానళ్లను రూ.160కే ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనితో వినియోగదారులపై చాలావరకు భారం తగ్గుతుందనే చెప్పాలి. అటు గతంలో ప్రతి 25 అదనపు ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్‌కు రూ.20 చెల్లించాల్సి ఉండగా దానిని కూడా ట్రాయ్ పూర్తిగా తొలగించింది.అంతేకాకుండా ఛానెల్ ప్లేస్‌మెంట్ మార్చడానికి అనుమతులను తప్పనిసరి చేసింది. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్స్ ఉంటే మాత్రం 40% వసూలు చేయాలని స్పష్టం చేసింది. కాగా, క్యారెజ్ ఫీజు కూడా ఒక సెట్‌అప్ బాక్స్‌కు 20 పైసలు మించకూడదని ట్రాయ్ వెల్లడించింది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM