తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదు : అశ్వత్థామరెడ్డి

byసూర్య | Mon, Oct 14, 2019, 03:57 PM

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో సమస్యపై వినతిని గవర్నర్ కు అందజేసినట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థమారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్చలేదని, రాష్ట్రంలో దహణకాండ పై గవర్నర్ కి అన్ని వివరించామన్నారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పాలకాలన్నారు. కారం రవీందర్ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగ సంఘాలతో కలిసేందుకు నిన్న కోరాము కానీ శ్రీనివాస్ రెడ్డి మరణం తో కలవడం కుదరలేదన్నారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామన్నారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ.. కేకే రాసిన లేఖపై తాము ఓపెన్ గానే ఉన్నామన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM