కన్న తండ్రే కుమారుల పాలిట కాలయముడైన ఘటన

byసూర్య | Sun, Oct 13, 2019, 01:39 PM

మేడ్చల్‌ లోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజబొల్లారం తండాలో.. కన్న తండ్రే కుమారుల పాలిట కాలయముౖడయ్యాడు. కుమారులకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాపించాడు. అనంతరం తానూ తాగాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని రోడామేస్త్రినగర్‌కు చెందిన సురేష్‌ దంపతులు రాజబొల్లారం తండాలో నివాసముంటున్నారు. సురేష్‌ భార్య మంజుల తల్లిదండ్రులు రాజబొల్లారంలోనే ఉంటున్నారు. వీరికి ప్రదీప్‌(7),ప్రణీత్‌(5)కుమారులున్నారు. మద్యానికి బానిసైన  సురేష్‌ అత్తగారి ఇంట్లోనే ఉంటూ స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేస్తుండగా మంజుల కూడా కంపెనీలో పనిచేస్తోంది. సురేష్‌ ఆరు నెలల క్రితం అదే గ్రామంలోనే అద్దె ఇంట్లోకి మారాడు.  శుక్రవారం రాత్రి  మద్యం తాగి ఇంటికి వచ్చిన సురేష్‌ భార్యతో గొడవ పడ్డాడు.


దీంతో మంజుల నిద్రలో ఉన్న పిల్లలను  వదిలేసి సమీపంలో ఉన్న తల్లి వద్దకు వెళ్లిపోయింది.  కొద్ది సేపటికి మత్తులో ఉన్న సురేష్‌ కూల్‌డ్రింక్‌ తీసుకువచ్చి అందులో విష గుళికలు కలిపి  పడుకున్న చిన్నారులకు తాపించి తాను కూడా తాగాడు. పిల్లల్ని తీసుకువచ్చి మంజుల దగ్గర వదిలిపెట్టి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. పిల్లలిద్దరూ పెద్దగా ఏడుస్తుండడం, గుళికల వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన మంజుల తన భర్తను నిలదీయగా విషయం చెప్పాడు.  వారిని వెంటనే మెడిసిటి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్న కుమారుడు ప్రణీత్‌(5) మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రదీప్‌(7) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు ప్రదీప్‌కు నగరంలోని నిలోఫర్‌ ఆస్పత్రికి, సురేష్‌ను గా«ంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా భన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మంజుల పోలీసులను కోరింది.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM