ప్రభుత్వ కౌంటర్ పై హైకోర్టు అసంతృప్తి

byసూర్య | Thu, Oct 10, 2019, 06:50 PM

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటీషన్ విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కౌంటర్ దాఖలు చేశాయి. బస్ పాస్ ఉన్నవారిని అనుమతి ఇస్తున్నారా అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్ల కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మరోసారి పూర్తి వివరాలతో రిపోర్టు అందించాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యా న్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల సమయం కావాలని ఆర్టీసి సంఘాలు కోరగా, ఐదు రోజులు మాత్రమే ఇచ్చింది. వాదనలు విన్న హైకోర్టు జడ్జి తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నేటికి ఆరో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ముఖ్యంగా గ్రామాలకు పండుగ కోసం వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓయు విద్యార్థి గత వారం ఆర్టీసి పై లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM