తెలంగాణలో మరో ఉద్యమం తప్పేలా లేదు: లక్ష్మణ్

byసూర్య | Thu, Oct 10, 2019, 07:06 PM

ప్రజలందరినీ ఏకం చేసి సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతామని తెలంగాణ బీజేపీ చీఫ్ కె లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నారని మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా ఆర్టీసీ ఆస్పత్రిలో సేవలను నిలిపేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మరో ఉద్యమం తప్పేలా లేదన్నారు. ఆర్టీసీ అంశంపై పోరాడటానికి తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. గురువారం (అక్టోబర్ 10) సాయంత్రం బీజేపీ నేతలతో కలిసి ఆయన ఆర్టీసీ అంశంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు.


ఆర్టీసీ సమ్మె విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత గవర్నర్‌పై ఉందని తెలిపారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు, ఇతర ఉద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.సీఎం కేసీఆర్.. తెలంగాణ ఆస్తులను తన ఆప్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. 50 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగించామని చెప్పడం బాధాకరం అన్నారు.


ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను, ప్రజల బాధలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడంలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లు కొత్తవేం కాదని.. తెలంగాణ రాక ముందు కేసీఆర్ కూడా ఈ డిమాండ్లు చేశారని తెలిపారు. పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని గతంలో కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM