దసరా కోసం ఆశావాహుల ఎదురుచూపులు

byసూర్య | Sun, Aug 25, 2019, 07:00 PM

దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సమాచారంతో దసరా పండుగ కోసం టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకు రాకపోయినా... తమ వాళ్లకు పదవులు వస్తే చాలనుకునేవాళ్లు వీరిలో చాలామంది ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం పరిమితంగా ఉండటం.. పలువురు ముఖ్యులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడు కేటీఆర్.. మేనల్లుడు టీ. హరీశ్ తో పాటు..పలువురు సీనియర్లకు పదవులు ఇవ్వకుండా తీసుకున్న కేసీఆర్ నిర్ణయం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పినా.. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కోరుకున్న పరిణామాలు చోటు చేసుకోవటం తర్వాత.. అసలుకు ఎసరు వచ్చినట్లుగా పార్టీకి ఇబ్బందికర ఫలితాలు ఎదురయ్యాయి.
దీంతో.. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం వాయిదా పడింది. ఈ దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కానీ.. వారెవరిని కేసీఆర్ దగ్గరకు రానివ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి పదవులు వస్తాయి? అన్నది పెద్ద సందేహంగా మారింది. ఇదిలా ఉంటే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. కేటీఆర్.. హరీశ్ లకు ఈసారి కేబినెట్ లో చోటు లభిస్తుందా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ కు బెర్త్ ఖాయమని.. హరీశ్ కు మాత్రం చోటు లభించే ఛాన్స్ ఉండదంటున్నారు. దీనికి పెద్ద కారణమే ఉందంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను చెప్పకనే చెప్పేసిన కేసీఆర్.. ఆ దిశగా గడిచిన ఐదేళ్లుగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ సంకేతాల్ని ఇస్తూ వచ్చారు. దీనిపై హరీశ్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అలా అని బయటపడలేక లోలోన మదనపడుతోంది. 
దసరా సందర్భంగా కేబినెట్ ను విస్తరించే క్రమంలో కేటీఆర్ తో పాటు హరీశ్ కు కూడా మంత్రి పదవి ఇస్తే.. ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని.. అదే జరిగితే ఇంతకాలం హరీశ్ ను పక్కన పెట్టిన దానికి అర్థం ఉండదు సరికదా.. పార్టీలో రెండు కూటములను కేసీఆరే స్వయంగా తెరిచినట్లు అవుతుందంటున్నారు. ఈ కారణంతోనే.. కేటీఆర్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసి.. హరీశ్ కు ఎలాంటి పదవి ఇవ్వకుండా చేస్తారన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలియాలంటే... మనం కూడా దసరా పండుగ కోసం ఆతృతగా ఎదురుచూడాల్సిందే.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM