byసూర్య | Mon, Jun 24, 2019, 10:44 AM
తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో నేటి నుంచి వీక్లీ ఆఫ్ లు అమలు చేయనున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో దశల వారీగా వీక్లీ ఆఫ్ లు అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు. వీక్లీ ఆఫ్ అమలుకు నోచుకోవడంతో 54వేల మంది పోలీసు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.