తెలంగాణ ప్రజల రక్షణ కవచం టీఆర్ఎస్: పల్లా రాజేశ్వర్ రెడ్డి

byసూర్య | Wed, Jun 19, 2019, 05:27 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మించి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ ప్రాణం పెట్టారని స్పష్టం చేశారు టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఎంతో శ్రమించారని చెప్పుకొచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ అభినందనలు తెలిపిందని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత పల్లా రాజశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 21న ప్రతీ ఒక్కరూ గ్రామగ్రామాన పండుగ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్  జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నట్లు తెలిపారు. 


 


టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రప్రజలకు రక్షణ కవచంగా ఏర్పడిన నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలో పార్టీ కార్యాలయాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఫండ్ తో రూ.19.20 కోట్లతో 32 జిల్లా కార్యాలయాల భవనాలను నిర్మించబోతున్నట్లు తెలిపారు.ఈనెల 24న కల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు భూమిపూజ చేయబోతున్నట్లు తెలిపారు. ఈనెల 24న భూమిపూజ చేసిన పార్టీ కార్యాలయాలను దసరా నాడు ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు.  ఈనెల 27న తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం నిర్వహించి అదే రోజు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని తెలిపారు. జూలై 20వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జూలై నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కమిటీలు వేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీ రెండు నియోజకవర్గాలకు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒకరు ఇంచార్జ్ గా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM