కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా రేణుకా చౌదరి ఖరారు

byసూర్య | Tue, Mar 19, 2019, 06:29 PM

జిల్లా లో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ని ఖరారు చేశారు. దీంతో తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గానూ అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు ఖమ్మం నుండి తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా నామా నాగేశ్వర్ రావు ఖచ్చితంగా అధికార పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోన్న విషయం విథితమే.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు రసత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి పార్టీలో బలమైన నాయకులు, ప్రతిపక్షాల ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో వున్న నామా నాగేశ్వర రావు ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇలా ఆయన గులాబీ పార్టీలో చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్ధిని కూడా ప్రకటిస్తూ దూకుడును ప్రదర్శించింది.
కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా మాజీ ఎంపి రేణుకా చౌదరి బరిలోకి దిగనున్నారు. లోక్ సభ టికెట్ విషయంలో ఆమెకు పోటీగా వున్న నామా  టీఆర్ఎస్ లో చేరడంలో రేణుకా చౌదరికి అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఆమెను తమ పార్టీ ఎంపీ అభ్యర్థిగా  కాంగ్రెస్ ప్రకటించింది. 


 


 


 


ఈ క్రమంలో ఖమ్మంలో పార్లమెంట్ స్థానంలో ఫోటీ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు ... కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి ఇద్దరూ జిల్లాలో బలమైన నేతలుగా మంచి పేరుంది. అంతేకాకుండా వీరిద్దరు ఒకే(కమ్మ) సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో ఈ పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM