అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి

byసూర్య | Thu, Mar 14, 2019, 06:14 PM

హైదరాబాద్ : అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ కే జోషి మాట్లాడుతూ..ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అందరూ కచ్చితంగా పాటించాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులు కొనసాగించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు చేపట్టాల్సిన చర్యలు మార్చి 31లోగా పూర్తి చేయాలి. కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేటలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉండేలా చూడాలి. సరళతర వాణిజ్య సంస్కరణలను 19వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.  గ్రామాల్లోనూ ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 29లోగా శిక్షణ పూర్తి చేయాలన్నారు. వేసవి కోసం కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. వైద్య, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ రాజ్, కార్మిక శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంచినీటి కొరత ఏర్పడకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM