గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ

byసూర్య | Sun, Jan 20, 2019, 11:08 AM

హైదరాబాద్: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ ప్రారంభమైంది. ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. సభలో వేముల ప్రశాంత్‌రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని బలపరిచారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి అద్దం పట్టిందని అన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో కనీవినీ ఎరుగని సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగున్నరేళ్లలో అమలయ్యాయని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ సంక్షేమ పథకాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయి కాబట్టే.. మళ్లి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని వివరించారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి.. అనే గాంధీజీ సిద్ధాంతాన్ని సీఎం కేసీఆర్‌ బలంగా విశ్వసిస్తారన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM