సీఎల్సీ నేతగా భట్టి నియామకం సరైనదే : కోమటిరెడ్డి

byసూర్య | Sat, Jan 19, 2019, 12:58 PM

 సీఎల్పీ నాయకుడి ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగించాము.. ఆయన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. భట్టి విక్రమార్కకి డిప్యూటీ స్పీకర్ గా చేసిన అనుభవం ఉందని, ఇప్పడున్న పరిస్ధితుల్లో సీఎల్పీ నాయకుడిగా భట్టి నియామకం సరైనదే అని కోమటిరెడ్డి అన్నారు. పదవి ఆశించడంలో తప్పులేదని కానీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు నష్టం చేసిందని కోమటిరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లు జరిగాయని చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి ఏ ఒక్కరినో బాధ్యత చేయడం సరికాదన్న కోమటిరెడ్డి అధిష్టానం కూడా కొంత ముందే అభ్యర్ధులను ప్రకటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. సీట్ల కేటాయింపులో కూడా కొన్ని లోపాలు జరిగాయన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అన్న విషయాన్ని మా జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని, పీసీసీ మార్పు మా పరిధిలో వ్యవహారం కాదని అది అధిస్టానం చూసుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM