విద్యుత్‌ స్వయం సమృద్ధి సాధించాం : గవర్నర్‌

byసూర్య | Sat, Jan 19, 2019, 12:35 PM

తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ స్వయం సమృద్ధిని సాధించిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. శాసనసభలో ఉభయ సభలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ త్వరలోనే విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పారు. కొత్త పవర్‌ ప్లాంటుల నిర్మాణం పూర్తి కావస్తోందని ఆయన అన్నారు. సోలార్‌ పవర్‌ ప్రొడక్షన్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ టూ స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు సరిపడా కరెంటు అందుతోందని ఆయన చెప్పారు.


యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు. పరిశ్రమలు, ఐటి రంగ విస్తరణ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కుదేలైన కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని ఆయన చెప్పారు. కుల వృత్తుల వారికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. గొల్ల కురుమలకు గొర్రెలను ఇచ్చామని, నేత కార్మికులకు రంగులు, దారాలు సబ్సిడీపై ఇస్తున్నామని ఆయన చెప్పారు.


Latest News
 

నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM