శంషాబాద్ చేరిన‌ విద్యార్థుల మృతదేహాలు

byసూర్య | Sat, Jan 19, 2019, 03:58 AM

 అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు శంషాబాద్‌ చేరుకున్నాయి. కాసేపట్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన సాత్వికా శరణ్‌, అరుణ్‌ సుహాస్‌ నాయక్‌, సుచరితా నాయక్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలకు సజీవదహనమయ్యారు. అమెరికాలోని కొలిర్‌విలిలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిక్కుకుని మొత్తం నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు నల్గొండ జిల్లాకు చెందిన టీనేజ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు. మృతుల్ని సాత్వికనాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచిత గుర్తించారు. వీరంతా 14 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వయస్సున్న వారే. మృతులు ముగ్గురు నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపు తండాకు చెందినవారు.
ఈ ముగ్గురు ఏడాది క్రితం స్కాలర్‌షిప్‌తో చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులు క్రిస్మస్ వేడుకలకు భారత్ వచ్చారు. దీంతో సాత్విక, సుహాస్, జయ్ ముగ్గురూ కొలిర్‌విలీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆ తరువాత తమ కుటుంబ స్నేహితులైన క్యారిక్రూడిట్ ఇంటికి వెళ్లారు. క్యారిక్రూడిట్ ఇంట్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ఆ మంటలకు విద్యార్థులతో పాటు క్యారిక్రూడిట్ కూడా చనిపోయారు. ఈ ప్రమాదంలో క్యారీక్రూడిట్ భర్త, కొడుకుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిద్దరినీ ఆస్పత్రిలో చికిత్సకు పంపించారు. అగ్నిప్రమాదంలో చిక్కుకుని తమ పిల్లలు ముగ్గురూ చనిపోయారన్న వార్త తెలుసుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అగ్నిప్రమాదానికి క్యారిక్రూడిట్ ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఫర్నీచర్‌తో పాటు లోపల వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. అమెరికా సమయం ప్రకారం రాత్రి 10 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి లోపలున్న వారిని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ మంటలను అదుపు చేసేసరికే లోపలున్న వారు విగతజీవులయ్యారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM