పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీ పుత్రుడు: కేసీఆర్

byసూర్య | Fri, Jan 18, 2019, 11:46 AM

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్పీకర్ గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమైన విషయమన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సభాపతి ఎన్నికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకోవడం హర్షణీయమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసిన సమయాన్ని నేను మరిచిపోలేను. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మంచి పనులు జరిగాయి. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది.


పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుంది..కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకం లాంటి పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నరు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డిదే. పోచారం పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. బాన్సువాడ ఉప ఎన్నికలో అఖండమైన మెజార్టీతో గెలుపొందారు. అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రడని మేము పిలుచుకుంటమన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM