భార్య బికినీ ఫోటోపై విరాట్ కోహ్లి ఎలా రియాక్ట్ అయ్యారంటే..

by సూర్య | Mon, Aug 19, 2019, 01:20 PM

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్లలో అనుష్క శర్మ ఒకరు. కేవలం అందగత్తె మాత్రమే కాదు, పలు విభిన్నమైన పాత్రలు చేయడం ద్వారా నటిగా తానను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. విరాట్ కోహ్లితో పెళ్లి తర్వాత అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క శర్మ... తాజాగా అభిమానులకు కనువిందు చేస్తూ బికినీ పిక్ పోస్ట్ చేశారు. 'సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.


విరాట్ కోహ్లితో వివాహం తర్వాత అనుష్క శర్మ సినిమా చేయడం తగ్గించేశారు. గతంలో మాదిరిగా ఫోటో షూట్లు, అందాల ఆరబోత లాంటి వాటికి కూడా దూరంగా ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె సూపర్ హాట్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్ గురించి ఫ్యాన్ సర్కిల్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.అనుష్క షేర్ చేసిన బికినీ పిక్ చూసి అభిమానులు మాత్రమే కాదు.. విరాట్ కోహ్లి కూడా ఫిదా య్యారు. తన మనసులోని భావాలను సింబల్స్ రూపంలో వ్యక్త పరిచారు. విరాట్ కోహ్లి చేసిన కామెంటుకు అతడి ఫ్యాన్స్ కూడా వేల సంఖ్యలో స్పందించారు. కోహ్లి విశాల హృదయాన్ని పలువురు ప్రశంసించారు.


టీమిండియా సారథిగా క్రికెట్‌ మ్యాచ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే విరాట్ కోహ్లి ఏ చిన్న సమయం దొరికినా భార్యతో కలిసి విహార యాత్రకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ఇటీవల అమెరికాలోని మియామీ బిచ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా అనుష్క బికినీ ఫోటో షేర్ చేశారు.నుష్క శర్మ, విరాట్ కోహ్లి వివాహం 2017లో జరిగింది. 29 సంవత్సరాలకే నేను పెళ్లి చేసుకున్నాను. నటీమణులు ఈ వయసులో పెళ్లాడటం చాలా అరుదు. కానీ నేను విరాట్‌తో ప్రేమలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్య్యూలో అనుష్క తెలిపారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM