ప్రభాస్ 60 అడుగుల కటౌట్.. చూసేయండి..

by సూర్య | Sun, Aug 18, 2019, 02:20 PM

కథానాయకుడు ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ‘సాహో’ సినిమాలోని ఆయన స్టిల్‌ను కటౌట్‌గా రూపొందించారు. ఈ మేరకు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.


‘సాహో’ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM