అగ్ర హీరోలపై ఉత్తేజ్ వ్యాఖ్యలు

by సూర్య | Sat, Aug 17, 2019, 12:38 PM

నాగార్జున `శివ` సినిమాలో సహాయక దర్శకుడిగా పనిచేయడమే కాకుండా.. చిన్న పాత్రలో నటించి మెప్పించిన నటుడు ఉత్తేజ్.. తర్వాత తనదైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నటనకు సంబంధించిన శిక్షణా సంస్థను స్థాపించి ఔత్సాహిక యువతీయువకులకు శిక్షణనిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారసత్వ నటులు గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దానికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.


వారసత్వమనేది నాగార్జున కాలం నుండి చూస్తున్నామని అయితే నట వారసులకు కూడా ఒకట్రెండు ఛాన్సులు మాత్రమే ఉంటాయని, నటవారసులు కూడా నిరూపించుకోకపోతే ఏం జరగుతుందో మనకు తెలుసునని ఉత్తేజ్ వ్యాఖ్యానించారు. రామ్‌చరణ్ చాలా ఫ్రొఫెషనల్ యాక్టర్.. అది తన తండ్రి నుండి వచ్చిన క్వాలిటీ. అల్లు అర్జున్ తొలి సినిమా నుండి, ప్రతి సినిమాకు తనను తాను చెక్కుకున్నారు. రవితేజ రియలిస్టిక్‌గా నటిస్తారని, ఎన్టీఆర్ పెద్ద స్టారే కాదు.. వ‌ృత్తి నిబద్ధత ఉన్ననటుడని తెలిపారు ఉత్తేజ్.

Latest News
 
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM