by సూర్య | Fri, Aug 16, 2019, 11:56 PM
నా తొలి సినిమా ‘రన్ రాజా రన్’ రిలీజై అప్పుడే ఐదేళ్లు దాటిపోయిందా ? అని ఆశ్చయపోతున్నాడు సాహూ దర్శకుడు సుజీత్ . ఐతే ప్రభాస్ లాంటి హీరో దొరకడంతో తన రెండో సినిమా ఆలస్యం పై తాను ఆలోచించలేదని దీనిని ఆలస్యంగా తను భావించడాం లేదని వ్యాఖాయనించారు ఆయన.
‘సాహో’ ఒక్కదానిలో తనకి పది సినిమాల్లో చేసినంత అనుభవం వచ్చేసిందని, ప్రపంచ స్థాయి టెక్నీషియన్లతో కలిసి సుదీర్ఘ కాలం పనిచేయడమే ఇందుకు కారణమని సుజీత్ తెలిపాడు. ‘బాహుబలి’ ఘన విజయం ప్రభాస్ ఇమేజ్ ని మార్చేసిందని , అయినా తాను తొలుత చెప్పిన కథలో ఎలాంటి మార్పులూ చేయకుండా తెరకెక్కించానని చెప్పాడు.
Latest News