by సూర్య | Fri, Aug 16, 2019, 08:08 PM
సినిమాల్లో తమ దేశాన్ని ప్రతికూలంగా చూపుతున్నారని ప్రముఖ పాకిస్తాన్ నటి మెవిష్ హయత్ బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు. ఓస్లోలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హయత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హాలీవుడ్లో ముస్లింల గురించి తప్పుగా చిత్రీకరిస్తు న్నారని ఆమె ఆరోపించారు. అయితే తాను ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో హయత్ వివరించారు. దుబాయ్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్లో బాలీవుడ్ గురించి మాట్లాడానని ఆమె చెప్పుకొ చ్చారు. ఐరాస వేదికగానూ తాను హాలీవుడ్లో ముస్లింలను చెడుగా చూపు తున్న తీరు ఇస్లాంఫోబియాకు దారితీస్తున్న వైనాన్ని ఎండగట్టానని చెప్పారు.
Latest News