ఫోటో స్టోరీ: హాలీవుడ్ హీరో లాగా ఉన్న వరుణ్ తేజ్

by సూర్య | Thu, Jun 20, 2019, 05:26 PM

తమిళంలో కొన్నేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసిన 'జిగర్ తండ'లో బాబీ సింహాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. హేర్ స్టైల్, గడ్డం పెంచి.. వాటికి డిఫరెంట్ స్టైలింగ్ చేయించి.. చాలా కొత్తగా తయారయ్యాడు. ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్‌ను చూసిన వాళ్లు లుక్ గురించి ఓ రేంజిలో చెబుతున్నారు. అతడి లుక్కే సినిమాలో సగం కిక్కు అంటున్నారు. 


తాజాగా వరుణ్ క్లోజప్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో వరుణ్ హేర్ స్టైల్, గడ్డం, ఓవరాల్ లుక్ చూస్తే వావ్ అనకుండా ఉండలేం. ఒక తెలుగు హీరోను ఇలాంటి లుక్‌‌లో ఎప్పుడూ చూసి ఉండం. హాలీవుడ్ హీరోల్ని తలపిస్తున్నాడు వరుణ్. 'దబంగ్'ను తనదైన శైలిలో తెలుగులో 'గబ్బర్ సింగ్'గా మలిచిన హరీష్ శంకర్.. 'జిగర్ తండ'కు కూడా తనదైన టచ్ ఇస్తున్నాడట. విలన్ పాత్రను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడట. తెలుగులో ఈ పాత్ర హీరోనా.. విలనా అని స్పష్టంగా చెప్పలేనట్లుగా.. మధ్యస్థంగా తీర్చిదిద్దాడట. వరుణ్ పాత్రకున్న ప్రాధాన్యత దృష్ట్యా.. తమిళంలో సిద్దార్థ్ చేసిన పాత్రను తెలుగులో చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం.. తమిళ నటుడు అధర్వను ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో కథానాయిక ఎవరనే విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. పూజా హెగ్డే అన్నారు కానీ.. ఆమే హీరోయిన్ అనే కన్ఫర్మేషన్ రాలేదు. ఈ చిత్రం సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM