'మట్కా' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, Oct 31, 2024, 03:21 PM

కరుణ కుమార్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మట్కా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి కథానాయికలగా నటిస్తున్నారు. 1958 నుండి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథ కారణంగా వరుణ్ తేజ్ మట్కాలో ఇప్పటి వరకు అత్యంత సవాలుగా ఉండే పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం వరుణ్ తేజ్ పాత్ర యొక్క యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ పీరియాడికల్ డ్రామా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం యొక్క యాక్షన్-ప్యాక్డ్ టీజర్ మరియు మేకింగ్ వీడియోలు విపరీతమైన సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్, సలోని మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ క్రూలో జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజర్, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై డా.విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.

Latest News
 
ప్రియుడు మహ్మద్ వాజిద్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న సనా సుల్తాన్ Tue, Nov 12, 2024, 04:16 PM
రాణి ముఖర్జీని ఈ పేరుతో పిలిచేవారు... Tue, Nov 12, 2024, 04:10 PM
‘సికందర్ కా ముఖద్దర్’ ట్రైలర్ విడుదల Tue, Nov 12, 2024, 03:55 PM
తెలుగు బ్యూటీ బర్త్ డే.. ఫొటోలు షేర్ చేసి అభిమానులకు ట్రీట్ Tue, Nov 12, 2024, 03:17 PM
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.... Tue, Nov 12, 2024, 02:17 PM