సుమతో 'కంగువ' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్

by సూర్య | Thu, Oct 31, 2024, 03:17 PM

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య తన తదుపరి సినిమాని శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'కంగువ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటులో విడుదల కానుంది. ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం "కంగువ" విడుదలకు ఒక నెల మాత్రమే సమయం ఉండటంతో నిర్మాతలు ప్రొమోషన్స్ ని చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ప్రముఖ యాంకర్ సుమ తో దివాళీ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ని యూట్యూబ్ లో విడుదల చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం యొక్క బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మాగ్నమ్ ఓపస్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొడక్షన్‌ హౌస్‌ స్టూడియో గ్రీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM