'విదా ముయార్చి' టీజర్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Wed, Oct 30, 2024, 05:34 PM

కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ మాగిస్హ్ తిరుమేనితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి  'విదా ముయార్చి' అనే టైటిల్ ని లాక్ చేసారు. థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2023లో ప్రారంభమైంది, విఘ్నేష్ శివన్ మొదట్లో వైదొలిగిన తర్వాత మగిజ్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా, ఎడిటర్ ఎన్‌బి శ్రీకాంత్ మరియు మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌తో సహా ఈ చిత్రంలో అద్భుతమైన సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఈ సినిమా రొమాన్స్ టచ్‌తో కూడిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా హామీ ఇస్తుంది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని నవంబర్ 10న విడుదల  చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అర్జున్, రెజీనా కసాండ్రా, బిగ్ బాస్ అరవ్, నిఖిల్ నాయిర్, సంజయ్ సారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది.

Latest News
 
విడుదలకు ముందే కేరళలో ‘కంగువ’ రికార్డ్ Tue, Nov 12, 2024, 10:15 PM
షూటింగ్‌లో సమంత స్పృహ తప్పి పడిపోయింది: వరుణ్ ధావన్ Tue, Nov 12, 2024, 10:10 PM
ప్రియుడు మహ్మద్ వాజిద్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న సనా సుల్తాన్ Tue, Nov 12, 2024, 04:16 PM
రాణి ముఖర్జీని ఈ పేరుతో పిలిచేవారు... Tue, Nov 12, 2024, 04:10 PM
‘సికందర్ కా ముఖద్దర్’ ట్రైలర్ విడుదల Tue, Nov 12, 2024, 03:55 PM