మన్మథుడు ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాడు చెప్మా ?

by సూర్య | Wed, Jun 19, 2019, 02:18 PM

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. రకుల్ .. కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషిస్తోంది. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా నుంచి వచ్చేనెల ట్రైలర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమాకి రీమేక్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ ప్రచారంపై నాగ్ ఎంత మాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఆ ఫ్రెంచ్ సినిమా గురించి అంతా మాట్లాడుకోవడం .. ఆన్ లైన్ లో చూసేయడం చేస్తారు గనుక, ముందు జాగ్రత్తతోనే నాగ్ సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. ఆ ఫ్రెంచ్ సినిమా రీమేక్ రైట్స్ తీసుకునే నాగ్ నిర్మిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని  ప్రకటించనున్నారు.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM