త్వరలో స్మాల్ స్క్రీన్ పై అలరించనున్న'డీమోంటే కాలనీ 2'

by సూర్య | Sat, Oct 26, 2024, 02:30 PM

సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పంపిణీ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ఆగస్ట్ 23న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2024 నుండి జీ5లో తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బి. సురేష్ రెడ్డి మరియు బి. మానస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఆంటి జస్కెలైన్, త్సెరింగ్ డోర్జీ మరియు అరుణ్ పాండియన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM