నవంబర్ 14న రిలీజ్ కానున్న మట్కా

by సూర్య | Tue, Oct 22, 2024, 11:17 PM

అప‌రేష‌న్ వాలంటైన్ చిత్రం త‌ర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం మట్కా. ప‌లాస వంటి క‌ల్ట్ చిత్రాన్ని రూపొందించిన కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించ‌గా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జీవీ ప్ర‌కాశ్  సంగీతం అందిస్తున్నాడు.


మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తుండ‌గా నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజర్, సాంగ్ లే లే రాజా.. హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్ర‌మంలో తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. మట్కా సెకండ్ సింగిల్ తస్సాదియ్యా అక్టోబర్ 24నన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ వరుణ్ తేజ్ రెట్రో అవతార్ లో కనిపించిన సాంగ్ ఎనౌన్స్ మెంట్ పోస్టర్ విడుద‌ల చేశారు.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM