పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్

by సూర్య | Tue, Oct 22, 2024, 11:28 PM

కోలీవుడ్‌ హీరోయిన్‌ రమ్య పాండియన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. పంజాబ్‌కు చెందిన యోగా ట్రైనర్‌ను ఆమె వివాహమాడనున్నారు. వీరి వివాహం వచ్చే నెలలో రిషికేశ్‌లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.‘జోకర్‌’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమ్య... ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ‘కుక్‌ విత్‌ కోమాలి’ అనే బుల్లితెర కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇపుడు నిశ్శబ్దంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు.


రమ్య బెంగళూరులోని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌కు చెందిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సెంటరులో యోగా శిక్షణ పొందే సమయంలో అక్కడ ట్రైనర్‌గా పనిచేసే లోవెల్‌ ధవన్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.కాగా లోవెల్‌ ధవన్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో ఉన్న పబ్లిక్‌ లేబోరేటరీస్‌కు యజమాని. వీరిద్దరి వివాహం వచ్చే నెల 8న జరగనుందని, నవంబరు 15న చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM