దీపావ‌ళి అనంత‌రం ఓటీటీ లోకి ‘దేవర’

by సూర్య | Tue, Oct 22, 2024, 11:16 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన‌ భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు. జాన్వీ క‌పూర్  హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్  కీల‌క పాత్ర‌లో న‌టించారు. అనిరుద్  సంగీతం అందించారు. ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా రూ.500కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది.


సినిమా విడుద‌లై నెల రోజులు కావొస్తుండ‌గా థియేట‌ర్ల‌లో వ‌సూల్లు గ‌ట్టిగానే రాబ‌డుతోంది. ఇటీవ‌ల రిలీజైప వేట్ట‌యాన్‌, వశ్వం సినిమాల‌ను మించి క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి ఔరా అనిపిస్తోంది. అయితే జూ. ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న స‌మ‌యం ఈరోజు వ‌చ్చింది. తాజాగా కొద్దిసేప‌టి క్రితం దేవ‌ర సినిమాలో బాగా పాపుల‌ర్ అయిన అయూధ పూజ ఫుల్ వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ విడుదల చేశారు. రామ‌జోగ‌య్య శాస్తి ర‌చించ‌గా అనిరుధ్ సంగీతంలో కాల‌భైర‌వ పాడిన ఈ పాట‌ట విడుద‌లైన క్ష‌ణాల్లోనే మిలియ‌న్ల‌కు పైగా సాధించి రికార్డు సృష్టించింది. ఇదిలాఉండ‌గా దీపావ‌ళి అనంత‌రం ఈ చిత్రాన్ని ఓటీటీకి తీసుకు రానున్నారు.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM