శ్రీనిధి శెట్టి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'తెలుసు కదా' టీమ్

by సూర్య | Mon, Oct 21, 2024, 07:12 PM

సిద్ధు జొన్నలగడ్డ తదుపరి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకుడిగా పరిచయం అవుతోంది. గార్జియస్ బ్యూటీస్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా 50% షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీనిధి శెట్టి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఎస్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ బాబా మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలితో సహా అగ్రశ్రేణి సాంకేతిక బృందంతో తెలుసు కదా సినిమా మాస్టర్ పీస్‌గా రూపొందుతోంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మరియు కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ శర్మ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమాలోని ప్రతి అంశాన్ని చాలా సున్నితంగా రూపొందించారు. వైవా హర్ష ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 

Latest News
 
స్వీయ వివాహం చేసుకున్న స్టార్ పాప్ సింగర్ Tue, Oct 22, 2024, 11:53 AM
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM