మరోసారి జంటగా కనువిందు చేయనున్నా దీపికా,రణ్‌వీర్‌

by సూర్య | Wed, Jun 12, 2019, 09:13 AM

దీపికా పదుకొణె - రణ్‌వీర్‌ సింగ్‌... బాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో వారి జోడీ ముందుంటుంది. తెర మీదైనా, నిజ జీవితంలో అయినా ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా  కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’ లాంటి చిత్రాల్లో తమ రొమాన్స్‌తో గిలిగింతలు పెట్టిన దీపిక, రణ్‌వీర్‌ మరోసారి జంటగా కనువిందు చేయనున్నారు. అయితే ఈసారి భార్యాభర్తలుగా నిజజీవిత పాత్రలు చేస్తుండటం విశేషం. కపిల్‌ దేవ్‌  జీవితకథతో తెరకెక్కుతున్న చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కపిల్‌ దేవ్‌ సతీమణి రోమీ భాటియా పాత్రలో  నటించడానికి తాజాగా అంగీకరించింది దీపిక. 1983 ప్రపంచ కప్‌ పోటీలో భారత జట్టును విజేతగా నిలపడంలో సారథిగా ప్రధాన పాత్ర పోషించారు కపిల్‌ దేవ్‌. క్రికెట్‌ కోసం జీవితాన్ని అంకితం చేసిన కపిల్‌కు వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచి, ఆయన విజయానికి తన వంతు సహకారం అందించిన రోమీ భాటియా పాత్ర చిత్రంలో కీలకంగా ఉంటుందట. అందుకే దీపికను ఎంచుకున్నారని తెలుస్తోంది. కాగా యాసిడ్‌ బాధితురాలిగా దీపిక నటించిన ‘ఛపాక్‌’ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమౌతోంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM