ఐఫా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న సమంత

by సూర్య | Sat, Sep 28, 2024, 04:58 PM

వరుసగా సినిమాలు చేస్తున్న సమంత సడెన్‌గా అనారోగ్యం బారిన పడటంతో ఒక్కసారి సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం సమంత ఏ తెలుగు చిత్రంలోనూ నటించడం లేదు. మయోసైటిస్‌ నుంచి బయటపడటానికి ఆమె నిత్యం యోగా, మెడిటేషన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమంతను చూస్తుంటే ఫుల్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపిస్తోంది. చాలా విరామం తరువాత సమంత ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌లో కనిపించారు. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐఫా ఫిలిం ఫెస్టివల్‌లో పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు పాల్గొన్నారు. ఐఫా వేడుకల్లో సమంత 'ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకునేటప్పుడు సమంత మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించారు.. ఆ లుక్‌ను మీరు చూసేయండి

Latest News
 
USAలో $4M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 08:37 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Sat, Sep 28, 2024, 08:32 PM
'స్వాగ్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, Sep 28, 2024, 08:24 PM
గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా‘ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Sep 28, 2024, 08:22 PM
'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్? Sat, Sep 28, 2024, 08:17 PM