'జీబ్రా' గ్లింప్సె విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Sat, Sep 28, 2024, 04:56 PM

తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ జీబ్రా అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ ప్రధాన పాత్రలో ఒకరు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది మరియు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గ్లింప్సె ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ మల్టీ స్టారర్‌కి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్ మరియు జెన్నిఫర్ పిక్కినాటో మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్, సత్య ఆకల, సునీల్, ప్రియా భవాని శంకర్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్ కాగా  మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటింగ్  చూసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. 

Latest News
 
IIFA 2024 పూర్తి విజేతల లిస్ట్ Sat, Sep 28, 2024, 06:54 PM
స్టార్‌ మాలో రేపటి సినిమాలు Sat, Sep 28, 2024, 06:40 PM
వెంకీ, బాలయ్యతో కలిసి పోజులిచ్చిన చిరు Sat, Sep 28, 2024, 06:37 PM
USAలో $3.7M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 06:33 PM
'గేమ్ ఛేంజర్' నుండి రా మచా మచా ప్రోమో అవుట్ Sat, Sep 28, 2024, 06:28 PM