50వ రోజు షోని ప్రేక్షకులతో వీక్షించనున్న'కమిటీ కుర్రోళ్లు' టీమ్

by సూర్య | Tue, Sep 24, 2024, 07:39 PM

నిహారిక కొణిదెల తొలి చలనచిత్ర నిర్మాణం 'కమిటీ కుర్రోళ్లు' ఆగష్టు 9, 2024న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరశురాజు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విశిక, మరియు షణ్ముకి నాగుమంత్రి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విడుదలైన నాలుగవ రోజున బ్రేక్ ఈవెన్ ని చేరుకొని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిన్న బడ్జెట్ చిత్రం 20 కోట్ల గ్రాస్ తో  ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసే లాంగ్ రన్‌లో అద్భుతంగా నడిచింది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా పరిశ్రమ తారల నుండి కూడా విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. ఇటీవలే మహేష్ బాబు, సుకుమార్, నాగ్ అశ్విన్, క్రిష్, దేవి శ్రీ ప్రసాద్, SS రాజమౌళి, చిరంజీవి, రామ్ చరణ్ మరియు నాని సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ నిర్మాత నిహారిక కొణిదెలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. కమిటీ కుర్రోల్లు ఇప్పుడు ETV విన్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క వ రోజు షోని సెప్టెంబర్ 26న బాలానగర్ లోని మైత్రి సినిమాస్ విమల్ థియేటర్ లో సాయంత్రం 7 గంటల షోని ప్రేక్షకులతో వీక్షించనున్నట్లు సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ వంశీ నందిపతి ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్‌ చేసారు. అనుదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.

Latest News
 
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Tue, Sep 24, 2024, 07:41 PM
50వ రోజు షోని ప్రేక్షకులతో వీక్షించనున్న'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Tue, Sep 24, 2024, 07:39 PM
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'SDT18' టీమ్ Tue, Sep 24, 2024, 07:30 PM
'జనక అయితే గనక' మరియు 'స్వాగ్' ఫన్ చిట్ చాట్ ఇంటర్వ్యూ అవుట్ Tue, Sep 24, 2024, 07:26 PM
'ది గోట్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే..! Tue, Sep 24, 2024, 07:17 PM