'ది గోట్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే..!

by సూర్య | Tue, Sep 24, 2024, 07:17 PM

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం సెప్టెంబరు 5, 2024న పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఎక్స్టెండెడ్ వెర్షన్ తో అక్టోబర్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ థ్రిల్లర్ 2004 మాస్కో మెట్రో బాంబు దాడి నుండి ప్రేరణ పొందింది మరియు తీవ్రమైన రైడ్‌గా ఉన్నట్లు సమాచారం. ది గోట్ విజయ్ యొక్క 68వ చిత్రం. డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా సాధించిన యువ వెర్షన్‌తో విజయ్ ఈ చిత్రంలో రెండు లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మనోబాలా, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Tue, Sep 24, 2024, 07:41 PM
50వ రోజు షోని ప్రేక్షకులతో వీక్షించనున్న'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Tue, Sep 24, 2024, 07:39 PM
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'SDT18' టీమ్ Tue, Sep 24, 2024, 07:30 PM
'జనక అయితే గనక' మరియు 'స్వాగ్' ఫన్ చిట్ చాట్ ఇంటర్వ్యూ అవుట్ Tue, Sep 24, 2024, 07:26 PM
'ది గోట్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే..! Tue, Sep 24, 2024, 07:17 PM