AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్

by సూర్య | Tue, Sep 24, 2024, 07:06 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా బుకింగ్స్ AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Latest News
 
30M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Tue, Sep 24, 2024, 07:41 PM
50వ రోజు షోని ప్రేక్షకులతో వీక్షించనున్న'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Tue, Sep 24, 2024, 07:39 PM
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'SDT18' టీమ్ Tue, Sep 24, 2024, 07:30 PM
'జనక అయితే గనక' మరియు 'స్వాగ్' ఫన్ చిట్ చాట్ ఇంటర్వ్యూ అవుట్ Tue, Sep 24, 2024, 07:26 PM
'ది గోట్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే..! Tue, Sep 24, 2024, 07:17 PM