'వెట్టయన్' సెకండ్ సింగల్ రిలీజ్

by సూర్య | Fri, Sep 20, 2024, 07:28 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ని సృష్టించింది. ఇటీవలే చిత్ర బృందం విడుదలా చేసిన ఈ సినిమా యొక్క మొదటి సింగిల్ సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సిఎంమాలోని సెకండ్ సింగల్ ని హంటర్ వంటార్ అనే టైటిల్ తో విడుదల చేసారు. అనిరుద్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి తేరుకురళ్ అరువి లిరిక్స్ అందించగా, సిద్ధార్థ్ బాసృర్ గాత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రజనీకాంత్‌తో సహా నటీనటులు తమ భాగాలకు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. సూపర్ కాప్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM