చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ

by సూర్య | Fri, Sep 20, 2024, 12:49 PM

సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది.అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ?పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ? తనే మీనాక్షి చౌదరీ.


 టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ లే అయినా.. ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా హిట్స్ అందుకుంటుంది. 1996 మార్చి 5న హర్యానాలో జన్మించిన మీనాక్షి.. 2018 ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్న రప్ గా నిలిచింది.2021లో అక్కినేని సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు తో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీతో మీనాక్షి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో కనిపించింది.అలాగే యంగ్ హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీలో కనిపించింది. ఈ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఒక్కసారిగా భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ దక్కించుకుంది. అందులో ఒకటి గుంటూరు కారం.సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రంలో ఈ బ్యూటీ నటించింది. ఇందులో మహేష్ మరదలు పాత్రలో కనిపించి అలరించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ జోడీగా మట్కా చిత్రంలో నటిస్తుంది.తాజాగా చీరకట్టులో ఉన్న ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మీనాక్షి చౌదరీ



 



 


Latest News
 
'హరిహర వీర మల్లు' షూటింగ్ పునఃప్రారంభంకి తేదీ లాక్ Fri, Sep 20, 2024, 03:26 PM
'డీమోంటే కాలనీ 2' ట్రైలర్ ని విడుదల చేసిన జీ5 Fri, Sep 20, 2024, 03:21 PM
స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Fri, Sep 20, 2024, 03:18 PM
$850K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 20, 2024, 03:12 PM
'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు Fri, Sep 20, 2024, 03:08 PM