స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం'

by సూర్య | Fri, Sep 20, 2024, 03:18 PM

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు రావు రమేష్‌ నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' సినిమా ఆగష్టు 23న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో రావు రమేష్ నటనకి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 20న అంటే ఈరోజు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్తిగా వినోదభరితమైన కామెడీ-డ్రామాగా పేర్కొనబడిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్నారు.

Latest News
 
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM
'35-చిన్న కథ కాదు' నుండి సయ్యారే సయ్య వీడియో సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:31 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 04:27 PM
శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్... శ్రీలీల రియాక్షన్ ఏంటో తెలుసా ? Fri, Sep 20, 2024, 04:22 PM
'మత్తు వదలారా 2' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:21 PM