'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు

by సూర్య | Fri, Sep 20, 2024, 03:08 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం దేవరపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ హైప్‌ని సృష్టిస్తోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ఉన్న ఈ సినిమా ఇటీవల విడుదలైన దాని థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం టాలీవుడ్ యువ నటులు మాస్ కా దాస్ విశ్వేక్ సేన్ మరియు సిద్ధూ జొన్నలగడ్డతో స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ యొక్క ఫుల్ వీడియోని విడుదల చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM
'35-చిన్న కథ కాదు' నుండి సయ్యారే సయ్య వీడియో సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:31 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 04:27 PM
శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్... శ్రీలీల రియాక్షన్ ఏంటో తెలుసా ? Fri, Sep 20, 2024, 04:22 PM
'మత్తు వదలారా 2' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:21 PM