రన్ టైమ్ ని లాక్ చేసిన 'దేవర'

by సూర్య | Wed, Sep 18, 2024, 05:14 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం దేవరపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ హైప్‌ని సృష్టిస్తోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటిగా ఉన్న ఈ సినిమా ఇటీవల విడుదలైన దాని థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' Fri, Sep 20, 2024, 03:18 PM
$850K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 20, 2024, 03:12 PM
'దేవర' టీమ్ తో టాలీవుడ్ యువ నటులు Fri, Sep 20, 2024, 03:08 PM
నేడే 'వెట్టయన్' ఆడియో లాంచ్ Fri, Sep 20, 2024, 02:52 PM
ముంబై విమానాశ్రయంలో కొత్త జంట Fri, Sep 20, 2024, 02:51 PM