'రాయన్' కి సాలిడ్ బుకింగ్స్

by సూర్య | Wed, Jul 24, 2024, 04:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ ని లాక్ చేసారు. కొద్దిరోజుల క్రితమే బుకింగ్స్ ప్రారంభం కాగా, ఈ సినిమా టిక్కెట్ల విక్రయాల్లో అద్భుతమైన జోరు చూపుతోంది. రాయన్ యొక్క ప్రీ-సేల్స్ తమిళనాడులో 2 కోట్ల మార్కును అధిగమించాయి. కర్ణన్ తమిళనాడులో 10 కోట్ల గ్రాస్‌తో ధనుష్‌కి అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్,ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల కానుంది.

Latest News
 
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM
'35-చిన్న కథ కాదు' నుండి సయ్యారే సయ్య వీడియో సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:31 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 04:27 PM
శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్... శ్రీలీల రియాక్షన్ ఏంటో తెలుసా ? Fri, Sep 20, 2024, 04:22 PM
'మత్తు వదలారా 2' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:21 PM