ట్రేండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' లోని మార్ ముంత చోడ్ చింత సాంగ్

by సూర్య | Wed, Jul 24, 2024, 04:41 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని మార్ ముంత చోడ్ చింత అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో గత వారం రోజులుగా ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఆగష్టు 15,2024న గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM