by సూర్య | Fri, Jul 12, 2024, 01:54 PM
నటి పూనమ్ కౌర్... ఆమె నటిగా ఏ సినిమాలు చేసిందో జనం మర్చిపోయారు కానీ ఆమెను మాత్రం మర్చిపోలేదు. అందుకు కారణం ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో కొత్త వివాదంలో నానుతూండటమే కారణం. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న కామెంట్స్ తో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. అంతేకాదు వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్ త్రివిక్రమ్ పై డైరక్ట్ గా ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు.వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై ప్రణీత్ హనుమంతు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సమాజం సిగ్గుపడేలా చేసిన దీనిపై అందరూ ఖండిస్తన్నారు. తిట్టి పోస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడికి వ్యతిరేకత వస్తోంది. అలాగే, హనుమంతుపై పలు కేసులు కూడా నమోదు అవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక ప్రణీత్ హనుమంతు ఇష్యూను ముందుగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా రైజ్ చేసిన విషయం తెలిసిందే. అతడు చేసిన ఈ ట్వీట్‌కు వ్యతిరేకంగా చాలా మంది కామెంట్లు పెట్టారు. అలాగే ఓ నెటిజన్ ఓ సినిమాలో పవన్ కల్యాణ్ మాట్లాడిన డైలాగుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఈ చిన్నపిల్లలతో పాటు ఆడపిల్లలపై ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమి కాదని ఇంతకుముందు కూడా తెలుగు హీరోలు కూడా ఇలాంటి చేశారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే ఇందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాపై కూడా ప్రస్తావన వచ్చింది. అక్కడ నుంచే ఈ వివాదం మొదలై పూనం కౌర్ కామెంట్స్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెబుతాడు. పడుకోని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఆనందం ఏముంటుంది.. పరిగెత్తించి పరిగెత్తించి చేయాలి అనే డైలాగ్ ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై రీసెంట్‌గా పూనం ఎక్స్‌లో స్పందిస్తూ.. త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది అని తెలిపింది.
జల్సా' సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో కామెంట్ కు ఆమె స్పందిస్తూ... త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ... త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలకు పూనం కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని పూనం అన్నారు. ఆయనతో నీకున్న అనుభవం మంచిది అయిండొచ్చని... కానీ, తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News