by సూర్య | Fri, Jul 12, 2024, 01:53 PM
శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి కామ్ బ్యాక్ ఇండియా లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు.
Latest News