ట్రేండింగ్ లో 'తంగలన్' తమిళ మరియు తెలుగు వెర్షన్స్ ట్రైలర్

by సూర్య | Thu, Jul 11, 2024, 04:23 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజగా ఇప్పుడు ఈ సినిమా యొక్క తమిళ, తెలుగు వెర్షన్ ట్రైలర్స్ ఇప్పుడు ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM