'NBK109' సెట్‌లో గాయపడిన బాలీవుడ్ నటి

by సూర్య | Wed, Jul 10, 2024, 05:07 PM

బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్‌బికె 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో బాలీవుడ్ దివా ఊర్వశి రౌతేలా ఫ్రాక్చర్‌తో ఆసుపత్రి పాలైంది. ఊర్వశి సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆమెకు గాయాలు తగిలాయి. గాయాలు చిన్నవి కానప్పటికీ ఊర్వశి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. చిత్ర బృందం విడుదల చేసిన ఒక ప్రకటనలో, NBK109 కోసం హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు నటి "భయంకరమైన" ఫ్రాక్చర్‌కు గురైందని సమాచారం. ఈ సినిమా మూడో షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఊర్వశి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చింది. ఫ్రాక్చర్ తీవ్రత మరియు ప్రమాదం యొక్క స్వభావం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, రిషి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'డార్లింగ్' Thu, Jul 18, 2024, 05:30 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Thu, Jul 18, 2024, 05:29 PM
డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, Jul 18, 2024, 05:27 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా' Thu, Jul 18, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Jul 18, 2024, 05:23 PM