ఈ తేదీన ప్రారంభం కానున్న 'దేవర' కొత్త షెడ్యూల్

by సూర్య | Wed, Jul 10, 2024, 04:46 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర; అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రం యొక్క ప్రధాన భాగం ఇప్పటికే పూర్తయిందని తాజా బజ్ వెల్లడిస్తుంది. తాజాగా ఇప్పుడు 10 రోజుల పాటు రెండు పాటలు మరియు టాకీ పార్ట్‌లో కొంత భాగాన్ని మాత్రమే చిత్రీకరించడానికి మిగిలి ఉన్నట్లు సమాచారం. జులై 10న శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్‌లతో కూడిన మాస్ డ్యూయెట్ పాటను చిత్రీకరించనున్నట్లు గతంలో నివేదించబడింది. ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌కు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM