'తంగలన్' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Wed, Jul 10, 2024, 02:44 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5 గంటలకి విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM